కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా కోట్లపూర్ పరిధిలోని రెడ్డికాలనీలో ఉన్న శ్రద్ధ స్కూల్ (Shraddha School)లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణం నుండి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కారణంగా ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించడంతో లోపల విద్యార్థులు ఎవరూ లేరు. ఒకవేళ తరగతులు జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని, సెలవు ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


