epaper
Wednesday, February 18, 2026
epaper

అల్లు అర్జున్ మీద ప్రముఖ యూట్యూబర్ షాకింగ్ పోస్టు

కలం, డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మీద ప్రముఖ యూట్యూబర్, పాడ్ కాస్ట్ యాంకర్ స్వీకృతి షాకింగ్ పోస్టు పెట్టింది. రీసెంట్ గా ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ అయిన కావేరీ బారువాను (Kaveri Baruva) స్వీకృతి పాడ్ కాస్ట్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ మీద కావేరీ చేసిన కామెంట్లు తీవ్ర వివాదం రాజేశాయి. ఓ యాడ్ షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్తే 42 కండీషన్లు మేనేజర్లు పెట్టారని.. హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు, కళ్లలోకి చూడొద్దు అని చెప్పారంటూ కావేరీ బారువా వెల్లడించింది.

ఆమె వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. కొందరు కావేరీ బారువాను తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ (Allu Arjun) టీమ్ స్పందిస్తూ.. కావేరీ చేసిన వ్యాఖ్యలు తప్పు అని.. బన్నీ అందరితో గౌరవప్రదంగా ఉంటారని.. ఆమె మీద పరువునష్టం దావా కేసు వేస్తామంటూ రియాక్ట్ అయింది.

ఈ క్రమంలోనే యూట్యూబర్ స్వీకృతి కూడా స్పందించింది. తాను చేసిన కావేరీ బారువా పాడ్ కాస్ట్ వీడియోను తన ఛానెల్ నుంచి డిలీట్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ‘నా గెస్ట్ కావేరీ మీద వస్తున్న సోషల్ మీడియా నెగెటివ్ పోస్టుల వల్ల ఆ వీడియోను డిలీట్ చేశాను. పీఆర్ మిషనరీలు, బాట్ అకౌంట్ల నుంచి కావేరీకి వేధింపులు వస్తున్నాయి. ఆన్ లైన్ ట్రోల్స్ వల్ల ఆమె ప్రొఫెషన్ కు ఇబ్బంది రానివ్వను. ఆమె పేరున్న సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆ వీడియోలో పూర్తిగా వాస్తవాలతో కూడిన ప్రొఫెషనల్ చర్చ జరిగింది. అంతేగానీ ఎవరినీ కించపరిచేందుకు కాదు. కానీ వాటి గురించి నేను వాదించడం కంటే.. నా గెస్ట్ ను రక్షించడమే నాకు ఇంపార్టెంట్. అల్లు అర్జున్, ఆయన పీఆర్ టీమ్ పూర్తిగా ఓడిపోయారు. వారంతా కేవలం అధికార దాహంతో ఉన్న వాళ్లే’ అంటూ రాసుకొచ్చింది స్వీకృతి. మరి దీనిపై అల్లు అర్జున్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా లేదా చూడాలి.

Read Also: ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతోంది : బాంబు పేల్చిన పొంగులేటి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>