కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) పై సదాశివపేట (Sadashivpet) పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని చాంద్ బాయ్ హోటల్ లో స్థానికులకు డబ్బులు పంచిన కారణంగా జగ్గారెడ్డి పై కేసు నమోదు చేశారు. ముపల్ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించి బహిరంగంగా డబ్బులు పంచినందుకు జగ్గారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు సదాశివపేట సిఐ వెంకటేష్ తెలిపారు.
Read Also: వరంగల్‌లో మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం
Follow Us On: Pinterest


