Mobile Popup Ad
Mobile Popup Ad

దేశ వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కలం, డెస్క్ : దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో టీనేజ్ వయసున్న పిల్లలు ఎక్కువగా మిస్ అవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. చిన్నారుల మిస్సింగ్ పై గురియా స్వయం సేవి సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ మీద స్పందించిన సుప్రీంకోర్టు (Supreme Court).. కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల మిస్సింగ్ వెనక ఏదైనా నెట్ వర్క్ ఉందా, రాష్ట్రాల్లో ఏవైనా ముఠాలు పనిచేస్తున్నాయా అనేది తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసుల డేటాను తీసుకోవాలని.. వీటి మధ్య ఉన్న కామన్ లింక్ ను గుర్తించాలని సుప్రీంకోర్టు సూచించింది.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వివరణ ఇస్తూ.. కొన్ని రాష్ట్రాలు మాత్రమే మిస్సింగ్ కేసుల డేటా ఇస్తున్నాయని.. మిగతా రాష్ట్రాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని తెలిపారు. ఆమె వివరణపై స్పందించిన సుప్రీంకోర్టు.. డేటా ఇవ్వని రాష్ట్రాలకు కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని.. అన్ని రాష్ట్రాలు ఈ మిస్సింగ్ కేసులపై కేంద్రానికి సహకరించాలని తెలిపింది.

దేశ వ్యాప్తంగా కేసులు..

గత జనవరి నెలలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చిన్నారుల మిస్సింగ్ కేసులు పెరిగాయి. ఢిల్లీలో 197 మంది చిన్నారులు కేవలం 27 రోజుల్లోనే కనిపించకుండా పోయారు. వారిలో ఇప్పటికీ 48 మంది ఆచూకీ మాత్రమే దొరికింది. కేవలం ఢిల్లీలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఇలా చాలా మంది మిస్ అవుతున్నారు. వీళ్లలో ఎక్కువగా 12 నుంచి 18 ఏళ్ల లోపు ఏజ్ ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు.

Read Also: ఓం బిర్లా సంచలన నిర్ణయం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>