కలం, వరంగల్ బ్యూరో: ప్రిన్సిపాల్ బూతులతో తిడుతూ, కులం పేరుతో దూషిస్తున్నారంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. పోలీసులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట (Kazipet) మండలం మడికొండ (Madikonda)లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులం ప్రిన్సిపాల్.. మంగళవారం కొందరు విద్యార్థినులను కొట్టారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు.
సుమారు వంద మందికి పైగా విద్యార్థినులు ర్యాలీగా బయలుదేరారు. విషయం తెలియడంతో మధ్యలోనే వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థినులు రోడ్డుపైనే బైఠాయించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సముదాయించే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సీడీపీవో, కాజీపేట తహసీల్దారు, ఇతర అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ తమను జట్టు పట్టుకొని కొట్టారని, కింద పడిపోయిన తమను కాళ్లతో తొక్కి పైకి లెమ్మని బెదిరించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం అంటూ తిడుతున్నారని చెప్పారు. (Madikonda) ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వాళ్లు వెనుదిరిగారు.
Read Also: దేశ వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: Instagram


