కలం, డెస్క్ : అన్నమయ్య (Annamayya) జిల్లాలోని పుంగనూరులో అమానుష ఘటన జరిగింది. డబ్బు కోసం కన్న కూతురు జీవితాన్నే బలి చేసింది ఓ తల్లి. కేవలం రూ.2 లక్షల కోసం కూతురును తాత వయసున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి (Child Marriage) చేసింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. శోభ అనే మహిళ తన 14 ఏళ్ల కూతురును రూ.2లక్షలకు కర్ణాటకకు చెందిన చంద్రశేఖర్ (54)కు అమ్మేసింది. చంద్రశేఖర్ తో పది రోజుల క్రితం రహస్యంగా బాలికకు వివాహం జరిపించారు.
చంద్రశేఖర్ తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ బాలిక తన చిన్నాన్న లోకేష్ కు ఫోన్ చేసి ఏడ్చేసింది. దీంతో లోకేష్ వెంటనే బాలిక తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీరిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలిక ఉంటున్న ఇంటి నుంచి విడిపించి తండ్రి సమక్షంలో ఉంచారు పోలీసులు. ఈ కేసులో (Child Marriage) కీలకంగా వ్యవహరించిన తల్లి శోభ తీరుపై పోలీసులు విచారిస్తున్నారు. బాల్య వివాహాలు నేరమని తెలిసినా సరే.. ఎందుకు చేశారంటూ పోలీసులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని.. అదే డబ్బు కోసమే ఇలా చేశారని కొందరు అంటున్నారు. గ్రామస్తులు మాత్రం.. డబ్బు దురాశతోనే తల్లి ఇలాంటి పని చేసిందని చెబుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Read Also: బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యం : ఆదిత్యనాథ్
Follow Us On: X(Twitter)


