epaper
Wednesday, February 18, 2026
epaper

స్టూడెంట్​ ని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

కలం, వెబ్​ డెస్క్​ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లో నాగరిక సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27), అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. బాలికను ప్రేమలోకి దించి, ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత 20 రోజుల క్రితం బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని గమనించిన తల్లి ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఉపాధ్యాయుడే తనను పెళ్లి చేసుకున్నట్లు బాలిక వివరించింది. ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని బాలిక కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు పర్రే మైటీన్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ (Teacher Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>