కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ (VC Sajjanar).. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ నిత్యం ఏదొక వీడియో పోస్టు చేస్తూ జాగ్రత్తలు తెలియయజేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసే ప్రమాదకరమైన స్టంట్ వీడియో పోస్ట్ చేశారు. బైక్‌లపై చేసే చిత్రవిచిత్ర విన్యాసాలు (Bike Stunts) చూడటానికి థ్రిల్లింగ్‌గా, క్షణికంగా కిక్ ఇచ్చేలా అనిపించవచ్చు. కానీ అదే క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదానికి దారితీయవచ్చనే నిజాన్ని మర్చిపోవద్దు.
చిన్న తప్పిదం జరిగినా జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. అంతేకాదు, మీ నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న ఎంతో మంది అమాయకులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, వ్యూస్ కోసం రోడ్డు మీద హీరోయిజం చూపించడం మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అవుతుంది. కొన్ని సెకన్ల ఫేమ్ కోసం జీవితాన్ని పణంగా పెట్టొద్దని సజ్జనార్ (VC Sajjanar) ట్వీట్ చేశారు.
Read Also: ‘బస్తర్’ సాంస్కృతిక వైభవం: ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp


