Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత కొత్త పార్టీ.. సీఎం రేవంత్ రియాక్షన్

కలం, తెలంగాణ బ్యూరో : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తనదైన శైలిలో స్పందించారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో ఆమె జిల్లాల పర్యటనపైనా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్‌తో, బీఆర్ఎస్‌తో బంధాలు, సంబంధాలు తెంచుకోవడంపైనా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక గంట ముందు ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో జరిపిన చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్ ఫ్యామిలీపైనా, కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త పార్టీ ప్రయత్నాలపైనా స్పందించారు.

ఆమె పార్టీ పెట్టినా, ఎవరినో తిట్టినా నాకెందుకు?

“కవిత ఆమె తన పంచాయతీని ఇంట్లో పరిష్కరించుకోవాలి.. ఇంట్లో ఆడబిడ్డను మంచిగా చూసుకోవడం తల్లిదండ్రుల పని.. తోడబుట్టినవారి బాధ్యత.. మహిళను పుట్టింటివారు చీర, సారె పెట్టిగౌరవించాలి.. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉన్నది.. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన సమస్య రోడ్డున పడితే నాకేం నష్టం?.. ఆమె పార్టీ పెడితే నాకేంటీ?… ఎవరినో తిడితే నాకేంటీ?..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాత్రికేయులు ప్రస్తావించగా పై విధంగా స్పందించారు.

“తెలంగాణలో ఉన్న చెల్లి విడిపోయింది (కవితను ఉద్దేశిస్తూ..). ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చెల్లి (షర్మిలను ఉద్దేశిస్తూ..) కూడా విడిపోయింది.. బీహర్‌లో లాలూ ప్రసాద్‌ కూతురు కూడా కుటుంబం నుంచి విడిపోయింది. కన్న తండ్రిపైనా, తోడబుట్టిన అన్నపైనా ఆమె తిరగబడింది.. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్‌ కుటుంబం విడిపోయింది.. మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌, శరత్‌పవార్‌ కుటుంబంలో కలహాలు వచ్చాయి.. ఇలాంటివి దేశంలో చాలాచోట్ల జరుగుతున్నాయి.. దానికి ఎవరు బాధ్యలవుతారు?..” అని సీఎం రేవంత్ (Revanth Reddy) గుర్తుచేశారు.

Read Also: బావబామ్మర్దులకు జైల్ సెంటిమెంట్… చిట్‌చాట్‌లో సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>