epaper
Wednesday, February 18, 2026
epaper

పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ

కలం, వెబ్ డెస్క్ : పగలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగను విశాఖ (Visakhapatnam) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి, ఒక BMW కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన 26 దొంగతనాల కేసుల్లో ఇతనికి సంబంధం ఉందని పేర్కొన్నారు. నిందితుడు మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, రూ.40,500 నగదు చోరీ చేసినట్లు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Read Also: కూటమి ప్రభుత్వం కమ్మగా ఉంది: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>