కలం, డెస్క్ : అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల ఇండియాకు ఎన్నో లాభాలున్నాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. రైతులు, పాడిపరిశ్రమకు ఎలాంటి నష్టం ఉండదని.. మరిన్ని లాభాలు చేకూరుతాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ట్రేడ్ డీల్ లో ఇండియా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుందని వివరించారు. రాబోయే రోజుల్లో ఇండియా 35 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారే ఛాన్స్ ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇన్ని రోజులు ట్రేడ్ డీల్ (Trade Deal) జరగక ఇండియాకు ఆర్థికంగా చాలా నష్టం జరిగిందని.. మేకిన్ ఇండియాను బలోపేతం చేయడం కోసమే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్టు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొన్ని రకాల వస్తువులపై సుంకాలను సున్నాకు తగ్గించింది కూడా చిన్న పరిశ్రమలను డెవలప్ చేయడం కోసమే అన్నారు మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal).
Read Also: ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ
Follow Us On: Sharechat


