కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ (T20 World Cup) ప్రారంభ దశలోనే బ్యాటర్లు తమ ముద్ర వేశారు. ఫిబ్రవరి 8 మధ్యాహ్నం నాటికి పూర్తైన నాలుగు మ్యాచ్‌ల తర్వాత రన్ స్కోరింగ్ పట్టిక ఆసక్తికరంగా మారింది. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో ముందంజలో నిలిచాడు. అతని తర్వాత తిలక్ వర్మ 25, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ నుంచి టిమ్ సైఫర్ట్ 65 పరుగులతో టాప్‌లో ఉండగా, గ్లెన్ ఫిలిప్స్ 42, మార్క్ చాప్మన్ 28 పరుగులు సాధించారు. అఫ్ఘానిస్థాన్‌లో గుల్బదిన్ నైబ్ 63 పరుగులతో జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అలాగే నైబ్ సహచరుడు సెదికుల్లా అతల్ 29, రహ్మనుల్లా గుర్బాజ్ 27 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరఫున షిమ్రాన్ హెట్‌మైర్ 64 పరుగులతో మెరిశాడు. బ్రాండన్ కింగ్ 35, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులు జోడించారు. పాకిస్థాన్‌లో షాహిబ్జాదా ఫర్హాన్ 47 పరుగులతో ముందుండగా, ఫహీమ్ అష్రఫ్ 29, సైమ్ అయూబ్ 24 పరుగులు చేశారు. యూఎస్ఏ జట్టులో శుభమ్ రంజనే, సంజయ్ కృష్ణమూర్తి చెరో 37 పరుగులతో సమానంగా నిలిచారు. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. టోర్నమెంట్ (T20 World Cup) ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రాబోయే మ్యాచ్‌ల్లో ఈ జాబితాలో మార్పులు రావడం ఖాయం.
Read Also: పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ
Follow Us On: Instagram


