epaper
Wednesday, February 18, 2026
epaper

మెరిసిన సూర్యకుమార్.. యూఎస్ఏ టార్గెట్ 162

కలం, వెబ్​డెస్క్​:​ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తొలి మ్యాచ్‌లో యూఎస్ఏతో భారత్ తలపడింది. ఇందులో ఇండియా బ్యాటింగ్ లైనప్​ తడబడింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ప్రతి బ్యాటర్ విఫలమయినా సూర్యకుమార్ (Suryakumar Yadav) మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్​లతో 84 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. మొత్తం తొమ్మిది వికెట్లు పడితే.. వాటిలో 8 క్యాచ్ ఔట్లే కావడం విశేషం.

యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ వాన్ అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. తన కోటా ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత హర్మీత్ సింగ్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలీఖాన్, మొహ్సీన్ చెరో వికెట్ తీశారు.

భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తర్వాతి స్థానంలో 25 పరుగులతో తిలక్ వర్మ నిలిచాడు. ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్​ మాత్రమే రెండంకెల స్కోర్ (14) చేశాడు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. అభిషేక్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. వరుణ్.. ఆఖరి బంతికి పరుగు తీసే క్రమంలో రనౌట్​ అయ్యాడు. దీంతో ప్రస్తుతం అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యం ఉంది.

Read Also: ఫైనల్‌కు ముందు నిద్ర పట్టలేదు: వైభవ్ సూర్యవంశీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>