కలం, డెస్క్ : అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) దేశానికే గర్వకారణం అన్నారు సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తో కలిసి క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలక అడుగు పడింది. ఏపీ యువతకు ఇదో గొప్ప అవకాశం. రాష్ట్ర అభివృద్ధి యువత మీదనే ఆధారపడి ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం’ అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు.
టెక్నాలజీ రంగంలో క్వాంటమ్ వ్యాలీ సూపర్ గా పనిచేస్తోందని.. క్వాంటమ్ రాబోయే రోజుల్లో టెక్నాలజీని శాసిస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. భవిష్యత్ లో టెక్నాలజీ పరమైన అన్ని సాఫ్ట్ వేర్ లు ఏపీ నుంచే సరఫరా అవుతాయన్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఇతర డేటా సెంటర్లు రావడం ఏపీకి కలిసి వచ్చే అంశం అన్నారు సీఎం చంద్రబాబు (Chandrababu) .
Read Also: అంబటి రాంబాబుపై ఏపీ వ్యాప్తంగా 36 కేసులు.. ఇప్పట్లో బెయిల్ కష్టమేనా..?
Follow Us On: Youtube


