కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley) నిర్మాణానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు పి.నారాయణ, కందుల దుర్గేష్, పాల్గొన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley)లో రెండు వరుసలలో ఎనిమిది భారీ టవర్లను నిర్మించనున్నారు. ఈ భారీ భవనాల నిర్మాణ బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన క్వాంటం కంప్యూటర్లను ఐబీఎం సంస్థ ఇక్కడ తయారు చేయనుంది. వీటికి అవసరమైన సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను టీసీఎస్ సంస్థ అందించనుంది. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
Read Also: దాడులపై పవన్ మౌనమెందుకు?: బొత్స సత్యనారాయణ
Follow Us On: Instagram


