కలం, డెస్క్ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం (Nampally Fire Accident) రాజకీయంగా చర్చలకు దారి తీస్తోంది. మొదటి అంతస్తులోని సీజ్డ్ ఫైళ్లు ఉండే గదిలోనే మంటలు చెలరేగాయి. ఈ గదిలోనే ఫోన్ ట్యాపింగ్, ఓటుకునోటు కేసులతో పాటు ఎమ్మెల్యే కొనుగోళ్లకు సంబంధించిన కేసు ఫైళ్లు కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై తాజాగా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఏ కేసు ఫైళ్లు కాలిపోయాయో ఇంకా తెలియలేదన్నారు. ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనుసాగుతున్నాయని.. త్వరలోనే కాలిపోయిన ఫైళ్లపై క్లారిటీ వస్తుందన్నారు.
Read Also: ఏఏ ఉత్పత్తులకు లాభమంటే.. ట్రేడ్ డీల్‌పై పీయూష్ గోయల్ వివరణ
Follow Us On: Youtube


