epaper
Wednesday, February 18, 2026
epaper

విజ‌య్‌కి షాకిచ్చిన‌ మ‌ద్రాస్ హైకోర్ట్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌ద్రాస్ హైకోర్ట్‌(Madras High Court)లో ఓ కేసుకు సంబంధించి ప్ర‌ముఖ‌ సినీ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు విజ‌య్‌(Vijay)కి చుక్కెదురైంది. గ‌తంలో విజ‌య్‌ రూ.15 కోట్ల సంపాద‌న‌కు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు లెక్కలు చూపించ‌లేదు. ఈ విష‌యం 2015లో ఆయ‌న ఇంట్లో ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు త‌నిఖీలు చేసిన స‌మ‌యంలో వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో ఆదాయ ప‌న్ను శాఖ విజ‌య్‌కి రూ.1.5 కోట్ల జ‌రిమానా విధించింది. దీనిపై విజ‌య్ మ‌ద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఈ అంశంపై హైకోర్ట్ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం విజయ్ వేసిన విన్నపాన్ని తిరస్కరించింది. ఆదాయ ప‌న్ను శాఖ‌ సెక్షన్ 263 ప్రకారం షో కాజ్ నోటీసులు జారీ చేసిన‌ట్లు కోర్ట్‌ వెల్ల‌డించింది. నోటీసు ఇవ్వడంలో ఎలాంటి లోపం లేద‌ని తెలిపింది. విజ‌య్ జ‌రిమానా చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>