Mobile Popup Ad
Mobile Popup Ad

యూరియా యాప్ రద్దు చేయాలి.. పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన

కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట(Suryapet) లో యూరియా యాప్ రద్దు చేయాలంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆఫ్‌లైన్ విధానంలో యూరియా బస్తాలు ఇవ్వడమే బెటర్‌గా ఉందని, యాప్ ద్వారా యూరియా బస్తాలను అందించడమే రైతులకు పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోని సూర్యాపేట (Suryapet) జిల్లాలోని చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు నిరసనకు దిగారు. యూరియా యాప్ (Urea App) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆగ్రహిస్తూ అన్నదాతలు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. యాసంగి సీజన్ నాట్లు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా (Urea) అందలేదు. రోజుల తరబడి యూరియా బస్తాల కోసం సొసైటీ కార్యాలయాలు, ఫర్టిలైజర్ల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా బస్తాల సరఫరా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ రైతులకు మరింతగా కష్టాలు ఎక్కువయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>