epaper
Wednesday, February 18, 2026
epaper

వైసీపీ నేత‌ల‌కు పోలీస్ నోటీసులు

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్(YS Jagan) ఇబ్ర‌హీంప‌ట్నం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ప‌లువురు వైసీపీ (YSRCP) నేత‌ల‌కు నోటీసులు జారీ చేశారు. నేడు జోగి ర‌మేష్‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ ఆయ‌న ఇంటికి రానున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు జోగి ర‌మేష్‌కు నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌వ‌ద్ద‌ని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు నోటీసులు అంద‌జేశారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి రోజా జోగి ర‌మేష్ నివాసానికి చేరుకున్నారు. ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, ఇంటిపై జ‌రిగిన దాడిని ప‌రిశీలించారు. మ‌రోవైపు జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ ప‌ర్య‌ట‌న‌కు వైసీపీ శ్రేణులు భారీగా త‌ర‌లిరావ‌డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో నేటి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై ఉత్కంఠ నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>