epaper
Wednesday, February 18, 2026
epaper

నక్క తోక తొక్కడమంటే ఇదే.. లాటరీలో రూ.49 కోట్ల జాక్ పాట్​

కలం, వెబ్​ డెస్క్ : దుబాయ్ లో లక్కీ లాటరీలో కర్ణాటకు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్​ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్​ లో నిర్వహించిన బిగ్​ టికెట్ లాటరీలో కర్ణాటకు చెందిన శంతను శెట్టిగన్ అనే వ్యక్తి రూ.49 కోట్లు గెలుచుకున్నాడు. ఆయన టికెట్​ నంబర్ డ్రాలో ఎంపిక కావడంతో అదృష్టవంతుడిగా మారాడు. శంతను శెట్టి ఉద్యోగం నిమిత్తం యూఏఈకి వెళ్లాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో డ్రాలో తనకు లాటరీ తగలడంతో ఆతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో చాలా మంది దుబాయ్ లో ఈ తరహా లాటరీ గెలుచుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>