epaper
Wednesday, February 18, 2026
epaper

బొగ్గుగనిలో పేలుడు.. 16 మంది మృతి

కలం, వెబ్​ డెస్క్​ : ఈశాన్య రాష్ట్రం అయిన మేఘాలయ (Meghalaya) లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్​ చేస్తుండగా బొగ్గుగనిలో పేలుడు (Coal Mine Blast) సంభవించి 16 మంది కూలీలు మరణించారు. దీంతోపాటు చాలా మందికి గాయాలయ్యారు. తూర్పు జైంతియా కొండల్లో ఉన్న ఓ గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో అస్సాంకు చెందిన వారు మరిణించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ మైన్స్​ లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్.. దాయాదికి 300 కోట్ల నష్టం?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>