epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రజా శ్రేయస్సే మా ధ్యేయం : ఎమ్మెల్యే కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో : ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో (Corporation Elections) కమ్యూనిస్టు కూటమి గాలి వీస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) అన్నారు. 60 డివిజన్ల వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని, ఎక్కడ చూసినా ఎరుపు, పసువు, నీలి జెండాల రెపరెపలు కనివిందు చేస్తున్నాయన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో గురువారం దళిత సంఘాల ఐక్య సంఘటిత వేదికతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజా శ్రేయస్సే తమకు ధ్యేయమని, తమకు పదవులు, అధికారం ముఖ్యం కాదన్నారు. కార్పొరేషన్ సాధించడం ద్వారా తన చిరకాల స్వప్నం సాకారమైందని, తద్వారా పాల్వంచ నుండి సుజాతనగర్ వరకు అనూహ్యమైన అభివృద్ధి జరగనుందన్నారు. పరిశ్రమలు రానున్నాయని, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవనవిధానం మెరుగు పడుతుందని చెప్పారు. ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు వచ్చాయని, వాటితో కార్పొరేషన్ వ్యాప్తంగా అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు.

ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుపాటు విషయంలో సమన్యాయం పాటించామని, జనరల్ స్థానాల్లో సైతం ఎస్సిలను నిలిపామని.. బిసి, మైనార్టీలకు సముచిత గౌరవం దక్కిందని చెప్పుకొచ్చారు. ఎర్రజెండాను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సిపిఐ, టిడిపి, దళిత సంఘాల ఐక్య సంఘటిత వేదిక కలిసి కష్టపడి పనిచేసి తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ పార్టీకి తమకు ఎలాంటి వైరం లేదని, సీట్ల సర్దుబాటు విషయంలో సంఖ్యా పరమైన సమస్య తలెత్తడంతో సిపిఐ (CPI) కూటిమి 60 సీట్లలో పోటీకి దిగిందని చెప్పారు.

విధాన పరమైన నిర్ణయాల వల్లే విడివిడిగా పోటీ చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా కలిసే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారం కోసం కక్కుర్తి పడే వాళ్లం అయితే ఎప్పుడో మంత్రులమయ్యే వాళ్లమని, ఎర్రజెండా నాయకులు ప్రధాని పదవిని సైతం ప్రజల కోసం ప్రక్కకు పెట్టారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తమదే, ఎమ్మెల్యేలది ఏముందిలే అని కొందరు అంటున్నారని, మరి ఎమ్మెల్యేల బాధ్యతలు ఏంటో తెలియదా అని ప్రశ్నించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి 12వ వార్డు అభ్యర్థి నాగలక్ష్మీ, 13వ వార్డు అభ్యర్థి పి.ఇందిరా ప్రియదర్శిని, 15వ వార్డు అభ్యర్థి కె సాహితి ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన (MLA Kunamneni) విజ్ఞప్తి చేశారు.

Read Also: 17 ఏళ్లుగా ఏం చేశారు..? కేటీఆర్‌ను నిలదీసిన సిరిసిల్ల ప్రజలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>