కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగరంలో బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal suryanarayana Gupta) కార్నర్ మీటింగ్ లలో పాల్గొన్నారు. 38వ డివిజన్ అరుంధతి నగర్ లో ఆ పార్టీ అభ్యర్థి పోతంకర్ మౌనికకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చని అసమర్థత ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ‘మన ఇందూర్ – మన మేయర్’ అని బిజెపి పార్టీ చెబుతేనే ఇతర పార్టీలకు గుబులు పుడుతుందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి భయపడి వారి నోటి నుండి ఇందూరు అని పేరు కూడా పలకడం లేదని తీవ్రంగా విమర్శించారు.
ముఖ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో అవినీతి, కమీషన్లకు, కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వడమే తప్ప చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని.. రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఈ నెల 6న జిల్లాకు వస్తున్నారని విమర్శించారు. బరాబర్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఒక ఛాలెంజ్ లా తీసుకొని మెజార్టీ స్థానాల్లో గెలిచి మేయర్ పీఠం తప్పక కైవసం చేసుకుంటుందని ఆయన (Dhanpal suryanarayana Gupta) ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, దుబ్బ మండల అధ్యక్షుడు గడ్డం రాజు, రంజిత్, విగ్నేష్, ముండదా పవన్, బొబ్బిడి శ్రీను, రాకేష్, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


