కలం, వెబ్డెస్క్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే యమ్నం ఖేమ్చంద్ సింగ్ను మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న కాసేపటికే రాష్ట్రపతి పాలన తొలగిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
మైతేయి (Meitei), కుకీల (Kuki) మధ్య చెలరేగిన జాతుల ఘర్షణతో గతేడాది మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రెసిడెన్సీ రూల్లో ఉన్న మణిపూర్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కేంద్రంలోని బీజేపీ భావించింది. అందుకు అనుగుణంగా అడుగులు పడ్డాయి. ఖేమ్చంద్ సీఎంగా, నెమ్చా కిప్గెన్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలో ఖేమ్చంద్ను బీజేపీ తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంది. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటూ గవర్నర్ అజయ్ భల్లాను సంప్రదించారు. దీంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను తొలగించింది. ఖేమ్చంద్ ముఖ్యమంత్రిగా మణిపూర్ (Manipur) లో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Read Also: విద్యుత్ స్తంభాలు, గృహ కనెక్షన్లపై కీలక మార్పులు
Follow Us On: Instagram


