epaper
Wednesday, February 18, 2026
epaper

ఫిబ్రవరి వచ్చింది.. రైతుబంధు ఏది : హరీష్‌ రావు

కలం మెదక్ బ్యూరో : మాజీ మంత్రి హరీష్‌ రావు (Harish Rao) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి వచ్చినా రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా డిసెంబర్ నెలలోనే వేశామని.. కానీ సీఎం రేవంత్ మాత్రం రైతులను పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పించారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని గుమ్మడిదల, గడ్డ పోతారం మున్సిపాలిటీలో హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మున్సిపాలిటీల్లో రైతులు ఉండరని సీఎం రేవంత్ (Revanth Reddy) అనుకుంటున్నారు. కానీ రైతులు అన్ని చోట్లా ఉన్నారనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, నేటికి 700 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు’ అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని.. ఉన్న పథకాలను రద్దు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు హరీష్ రావు (Harish Rao). ఈ ప్రచారంలో పటాన్ చెరువు నియోజకవర్గం బిఆర్ ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి , స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read Also: పవన్ కల్యాణ్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి : మహేష్ గౌడ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>