epaper
Wednesday, February 18, 2026
epaper

భారత్‌, పాక్ మ్యా‌చ్.. అశ్విన్ సంచలన కామెంట్లు

కలం, వెబ్ డెస్క్:  టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ తప్పకుండా జరుగుతుందని రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ తమ బాయ్‌కాట్ నిర్ణయాన్ని త్వరలోనే మార్చుకుంటుందని అంచనా వేశారు. ఐదు రోజుల్లో పరిస్థితి మారుతుందని చెప్పారు. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగనుందని తెలిపారు. ఈ టోర్నీలో ఇండియా–పాక్ మ్యాచ్ అత్యంత కీలకమని అశ్విన్ భావనగా వెల్లడించారు. పాకిస్థాన్ ఆడకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం తప్పదని చెప్పారు. సభ్య దేశాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రసార సంస్థలు కూడా నష్టపోతాయని వివరించారు.

ఈ అంశం ఐసీసీ సమావేశాల్లో పెద్ద చర్చగా మారే అవకాశం ఉందని అశ్విన్ (Ashwin) సూచించినట్లు సమాచారం. పాకిస్థాన్ కారణంగా నష్టాలు వస్తున్నాయని ఇతర దేశాలు ప్రశ్నించే పరిస్థితి రావచ్చని చెప్పారు. బహిష్కరణ కొనసాగితే పాకిస్థాన్‌కే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఎన్‌వోసీలు ఇవ్వకపోవచ్చని తెలిపారు.

ఇండియా–పాక్ మ్యాచ్ తటస్థ వేదికపై జరగనుండటంతో వేదిక అంశం అసలు సమస్య కాదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఒక ప్రత్యర్థితో ఆడబోమని చెప్పడం సమంజసం కాదన్నారు. ఈ మ్యాచ్‌లు జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని అశ్విన్ సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను 3-0తో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు అసలైన సవాలు వారి మనస్తత్వమేనని చెప్పారు. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐసీసీ స్థాయిలో చర్చలు కొనసాగనున్నాయి. పరిస్థితిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>