epaper
Wednesday, February 18, 2026
epaper

సింగిల్ పార్ట్‌గా ‘వారణాసి’.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్

కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ ” వారణాసి”(Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కే.ఎల్ నారాయణ నిర్మాణంలో దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ పృద్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా వారణాసి సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతుంది అని న్యూస్ వైరల్ అయింది.

అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఓ హాలీవుడ్ మీడియా సమావేశంలో కీలక విషయాలు తెలియజేశారు. నా ప్రతీ సినిమా రామాయణం నుంచి స్పూర్తి పొంది తెరకెక్కిస్తాను. కానీ వారణాసి సినిమాలో మాత్రం రామాయణంలో కొంత భాగాన్ని చూపించనున్నామని తెలిపారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఆదరించారో వారణాసి చిత్రం కూడా అంతకంటే ఎక్కువగా  ఆకట్టుకుంటుందని తెలిపారు. అలాగే ఈ సినిమా రెండు పార్ట్స్ విషయంలో కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. కథ పెద్దది కావడంతో ముందుగా ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించాలని భావించాము. కానీ ఆ  ఆలోచన వెంటనే మార్చుకున్నామని తెలిపారు. వారణాసి ఒకే పార్ట్ గా రాబోతుంది.. సినిమా నిడివి 3 గంటలు వరకు ఉండనుందని తెలిపారు. ఆ మూడు గంటలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని రాజమౌళి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>