Mobile Popup Ad
Mobile Popup Ad

కల్కి 2 : దీపికా స్థానంలో సాయిపల్లవి ?

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ” కల్కి 2898AD” (Kalki 2898 AD). 2024 జూన్  27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానం, విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్  సుమతి (SUM-80) అనే కీలక పాత్రలో నటించింది. ఆ పాత్రలో ఉండే భావోద్వేగాలను దీపిక అద్భుతంగా పండించారు. దీపికా పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.

త్వరలో కల్కి సినిమాకు పార్ట్ 2 షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా నుండి దీపికా పదుకోన్ తప్పుకున్నారు. డేట్స్ అడ్జెస్ట్మెంట్, ఇతర కారణాల వల్ల దీపికా ఈ సినిమా నుండి తప్పుకున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే పార్ట్ 2 (Kalki 2) లో సుమతి పాత్రలో ఎవరు నటిస్తారు అనేది ప్రశ్నగా మారింది. మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, ప్రియాంక చోప్రాలలో ఎవరో ఒకరు ఈ పాత్ర చేస్తారని న్యూస్ తెగ వైరల్ అయింది. తాజాగా దీపికా పాత్రలో సాయిపల్లవి (Sai Pallavi) ఫిక్స్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. సుమతి పాత్రలో ఉండే భావోద్వేగాలను సాయిపల్లవి చక్కగా హ్యాండిల్ చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో  సాయి పల్లవి పేరు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

Read Also: ధనుష్‌తో మరోసారి సాయిపల్లవి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>