epaper
Wednesday, February 18, 2026
epaper

ఫిరాయింపు కేసు.. రేపు కడియం విచారణ

కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి రేపు (బుధవారం) కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని (Kadiyam Srihari)  స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించబోతున్నారు. హైదరాబాద్‌లోని స్పీకర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణ ప్రక్రియ జరగబోతున్నది. ఈ  కేసుకు సంబంధించి పిటిషనర్ వివేకానందను కూడా క్రాస్-ఎగ్జామినేషన్ చేయనున్నారు. కడియం శ్రీహరి, వివేకానంద ఇద్దరూ తమ తరఫు న్యాయవాదులతో విచారణకు హాజరై వాదనలు వినిపించనున్నారు. అనంతరం స్పీకర్ ఈ అంశానికి సంబంధించి ఓ నిర్ణయానికి రానున్నారు.

కడియం శ్రీహరి (Kadiyam Srihari) కూతురు కావ్య గత పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో కడియం ఆమెను బలపరుస్తూ సంతకం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుడైన కడియం.. కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇచ్చారన్న అంశాన్ని పిటిషనర్ వివేకానంద స్పీకర్ ముందు లేవనెత్తనున్నట్టు సమాచారం. అయితే తాను బీఆర్ఎస్ సభ్యుడినేనని ఇప్పటికే పలుమార్లు కడియం స్పష్టం చేశారు. తన కూతురు కాబట్టి తాను బలపరిచానని.. ఆమె ఏ పార్టీతో పోటీ చేస్తే తనకు సంబంధం ఏమిటని కడియం స్పీకర్‌కు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి అంతిమ నిర్ణయం స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad Kumar) తీసుకోనున్నారు.

Read Also: సిద్దిపేటలో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>