epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ ఎన్నికలు.. నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Election) హడావుడి నెలకొన్నది. అన్ని పార్టీల ప్రచారాల ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు (మంగళవారం) చివరి రోజు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2,996 వార్డులకు ఇప్పటివరకు 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీలో ఉన్నారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుండగా, పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>