కలం, డెస్క్ : మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే తన ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఆరోపించారు. తనకు ఏం జరిగినా దానికి మంత్రి లోకేష్ (Nara Lokesh) కారణం అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఆదివారం వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. ‘నన్ను మళ్లీ జైలుకు పంపించాలని కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి దాడులు చేసి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
కానీ నేను చట్టాన్ని గౌరవిస్తా. ఇలాంటి దాడులకు భయపడను. మళ్లీ అరెస్ట్ చేసినా జైలుకెళ్లేందుకు సిద్ధం. నా మీద మళ్లీ కేసులు పెడుతున్నారు. బెయిల్ రద్దు చేయాలని కోర్టులకు వెళ్తున్నారు. ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ చూడలేదు. ఏపీలో శాంతిభద్రతలు లోపించాయి. సీఎం చంద్రబాబు హింసకు ఉసిగొల్పుతున్నారు’ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh).
Read Also: హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్ర : సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp


