కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అలజడి సృష్టించి.. హింసను ప్రేరేపించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) మండిపడ్డారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో సీఎం పలు సూచనలు చేశారు. అధికారం కోల్పోయామన్న ఫ్రస్టేషన్ లో వైసీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందన్నారు. ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులను డైవర్ట్ చేయడానికే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ (YCP) పన్నుతున్న ట్రాప్ లో పడకుండా కార్యకర్తలకు మంత్రులు, పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన ప్రతీ ఒక్కరినీ శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం స్వాగతించదు : ఎంపీ పురందేశ్వరి
Follow Us On: Youtube


