కలం, వెబ్ డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ తండ్రి కన్న కూతుర్ని హతమార్చాడు (Father Kills Daughter). నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర(Maharashtra)లోని నాందేడ్ (Nanded) జిల్లాలో ముఖేడ్ తాలూకాకు చెందిన పాండురంగ్ కొండమంగళే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పాండురంగ్ ముఖేడ్ తాలూకాలోని కెరూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. బార్హాళీ ప్రాంతంలో హెయిర్ కట్టింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం పాండురంగ్ తన భార్యకు సరుకులు కొనడానికి వెళ్తున్నానని చెప్పి, ఏడేళ్ల కూతురు ప్రాచీని తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం తెలంగాణలోని నిజామాబాద్‌కు వచ్చాడు. ఎడపల్లి ప్రాంతంలో బోధన్ రోడ్డుపై ఉన్న నిజాంసాగర్ కాలువలో కూతుర్ని తోసేశాడు. ఆ తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాడు.
కాలువలో చిన్నారి మృతదేహం లభించడంతో ఎడపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ముఖేడ్‌కు వచ్చి పాండురంగ్ కొండమంగళేను విచారించారు. పోలీసుల విచారణలో దారుణ విషయాలు బయటపడ్డాయి. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే పాండురంగ్ తన కూతురిని హతమార్చినట్లు (Father Kills Daughter) వెల్లడైంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు కొన్ని నిబంధనలున్నాయి. ముగ్గురు సంతానం ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయరాదు. దీంతో ఒకరిని చంపేస్తే ఎన్నికల్లో పోటీకి అర్హత సాధించవచ్చని పాండురంగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ నేరంలో పాండురంగ్‌కు కెరూర్ సర్పంచ్ గణేష్ కూడా సహకరించాడు. దీంతో పోలీసులు పాండురంగ్‌ను, గణేష్‌ను అరెస్ట్ చేశారు.
Read Also: తిరుపతిలో నడిరోడ్డుపై కత్తులతో మందుబాబుల హల్చల్..
Follow Us On: X(Twitter)


