కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)పై అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు తట్టుకోలేని కార్యకర్తలు అంబటి ఇంటి వద్ద నానా భీభత్సం సృష్టించారు. అలాగే ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటుగా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
చంద్రబాబుకి క్షమాపణలు చెప్పాలని కూటమి నేతలు అంతా అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపి పురందేశ్వరి (Purandeswari) అంబటి వాడిన మాటలని ఖండించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడిన భాషను సభ్య సమాజం స్వాగతించదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించడం అందులోనూ ఆయన తల్లిని దూషించడం మహిళా లోకం స్వాగతించరని ఆమె తెలిపింది.
Read Also: కావాలనే రాష్ట్రంలో ఆందోళనలు సృష్టిస్తున్నారు : ఎంపీ సీఎం రమేశ్
Follow Us On: Sharechat


