epaper
Monday, February 2, 2026
spot_img
epaper

కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన కవిత.. మున్సిపల్ ఎన్నికలపై సెన్సేషనల్ కామెంట్

కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవాలని కేటీఆర్ (Kavitha) తాపత్రయపడుతూ ఉంటే ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత (KTR) ఊహించని షాక్ ఇచ్చారు. సెంటిమెంట్‌ను వాడుకోవాలన్న కేటీఆర్ ప్రయత్నానికి బ్రేక్ వేశారు. కేసీఆర్ ఇమేజ్ వాడుకోవాలన్న కేటీఆర్ ప్లాన్‌ను బహిర్గతం చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసి ఉపసంహరణకు గడువు దగ్గర పడుతున్న సమయంలో కేటీఆర్, బీఆర్ఎస్ ప్లాన్‌ బెడిసికొట్టేలా ఆమె ఓటర్లకు స్పష్టమైన అప్పీల్ చేశారు. కేటీఆర్ మాటల్ని నమ్మి ఓటు వేస్తే ఐదేండ్లు మోసపోతారంటూ ప్రజలను కోరారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రెస్‌మీట్ ద్వారా ఓపెన్‌గానే కేటీఆర్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆమె (Kavitha) చేసిన కామెంట్లను ఆమె మాటల్లోనే చూద్దాం…

“మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్‌ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ (KTR) అంటున్నారు… అంటే, కేసీఆర్ లేబుల్ చూసి ఓటు వేయాలని కోరడం ఏంటి?.. మంచోడైనా, చెడ్డోడైనా ఓటు వేయాలనడం మీ నితంతృత్వ, రాచరిక పోకడలకు నిదర్శనం… కులం, మతం, చుట్టం అని చూసుకుని ఓటు వేయాలా?..” అని నిలదీశారు. పైసలు చూసి మాత్రం ఓటు వేయవద్దు అంటూ ప్రజలకు అప్పీల్ చేశారు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయాలని కోరారు. పైసలు అడిగిటోడు కాకుండా ఆపదలో ఆదుకునేవారిని, జనం కోసం పనిచేసేటోళ్లను గెలిపించుకోవాలని కోరారు. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా నష్టపోతాం అని కవిత (Kavitha) హెచ్చరించారు.

Read Also: కేసీఆర్​ సిట్​ విచారణపై కవిత కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>