కలం, వెబ్‌డెస్క్: ఇరాన్(Iran) దేశాన్ని భూకంపం వణికించింది. దక్షిణ ఇరాన్‌లోని బూషెహ్ర్ (Bushehr)ప్రావిన్స్‌లోని అసాలుయేహ్ నగరంలో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైంది. టెహ్రాన్ విశ్వవిద్యాలయానికి చెందిన జియోఫిజిక్స్ ఇనిస్టిట్యూట్ సీస్మాలజీ సెంటర్ నివేదిక ప్రకారం.. భూకంప కేంద్రం భూమికి 18 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం. కానీ పలు భారీ భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మెహర్, బిద్ధన్ అఖండ్ ప్రాంతాలలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. భూకంప రేఖలపై ఉన్న ప్రాంతంలో ఉన్నందున ఇరాన్లో తరచూ ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. ఇరాన్‌తో పాటు ఖతార్, యూఏఈలోనూ స్వల్ప భూప్రకంపనలు జరిగినట్లు తెలుస్తోంది.


