epaper
Monday, February 2, 2026
spot_img
epaper

హైద‌రాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

క‌లం, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకొని నేడు తెల్ల‌వారుజామున హైద‌రాబాద్(Hyderabad) చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో రేవంత్‌కు పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొనేందుకు జ‌న‌వ‌రి 21న సీఎం రేవంత్ దావోస్‌(Davos)కు వెళ్లారు. అనంత‌రం అక్క‌డి నుంచి జ‌న‌వ‌రి 25న‌ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)లో లీడర్‌షిప్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఐదురోజుల శిక్ష‌ణ ముగించుకొని స‌ర్టిఫికెట్ అందుకున్నారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున రేవంత్ తిరిగి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈ ప‌ది రోజుల ప‌ర్య‌ట‌న‌లో అటు దావోస్‌లో, ఇటు హార్వ‌ర్డ్‌లో రేవంత్ రెడ్డి ప‌లు ముఖ్య స‌మావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్ 2047ను ప్ర‌తి స‌మావేశంలో వివ‌రించారు. నేడు మంత్రులు, పీసీసీ ముఖ్య నేత‌ల‌తో రేవంత్ రెడ్డి స‌మావేశం కానున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు, తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>