కలం, వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2026 ప్రారంభానికి పట్టుమని పది రోజులు కూడా లేవు. ప్రతి జట్టు టైటిల్ కోసం ఘోర సన్నాహాలు చేస్తున్నాయి. ప్రత్యర్థులను మట్టి కరిపించడం కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. 2007 నుంచి 2024 వరకు జరిగిన 9 ఎడిషన్లలో ఏ ఖండం ఎక్కువ టైటిళ్లు గెలిచింది అని సోషల్ మీడియాలో అంతా సెర్చ్ చేస్తున్నారు.
ఈ టోర్నీ 2007లో దక్షిణాఫ్రికాలో మొదలై, భారత్ (India) తొలి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్‌లో పాకిస్థాన్ (Pakistan) టైటిల్ గెలిచింది. 2010లో వెస్టిండీస్ వేదికగా ఇంగ్లండ్ తొలి కప్ అందుకుంది. 2012లో శ్రీలంకలో జరిగిన ఎడిషన్‌లో వెస్టిండీస్ (West Indies) ఛాంపియన్ అయింది.
2014లో బంగ్లాదేశ్‌లో శ్రీలంక టైటిల్ దక్కించుకుంది. 2016లో భారత్‌లో వెస్టిండీస్ రెండోసారి కప్ గెలిచింది. 2021లో యూఏఈ, ఒమన్ వేదికలపై ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌ను (T20 World Cup) సొంతం చేసుకుంది. 2022లో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
తాజాగా 2024లో యూఎస్ఏ-వెస్టిండీస్ టోర్నీలో భారత్ మరోసారి విజయం సాధించి ఆసియాకు నాలుగో టైటిల్ అందించింది. ఖండాల వారీగా ఆసియా 4 టైటిళ్లతో ముందుంది. యూరప్ 2, అమెరికా 2, ఓషేనియా 1 టైటిల్ గెలిచాయి. ఆఫ్రికాకు ఇప్పటివరకు కప్ రాలేదు.
Read Also: కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ రియాక్షన్.. దేశ సంక్షోభాన్ని పట్టించుకోలేదని ఫైర్!
Follow Us On : WhatsApp


