కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్‌లో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Excise Constable Soumya )భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్, కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ రామకృష్ణా రావు ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read Also: రాంచరణ్, ఉపాసన దంపతులకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు
Follow Us On: Sharechat


