కలం, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ 2026లో (Budget 2026) సెమి కండెక్టర్ రంగానికి భారీ కేటాయింపులు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించిన బడ్జెట్లో ఈ రంగం అభివృద్ధికి 40 వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రకటించారు. ‘ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0’ ప్రారంభిస్తామని తెలిపారు.సెమికండక్టర్ మిషన్ 2.0లో పరిశ్రమ ఆధారిత పరిశోధన కేంద్రాలు, శిక్షణ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ సంవత్సరం ప్రభుత్వం సంస్కరణలపై ఎక్కువ దృష్టి సారించినట్టు చెప్పారు. భారత్ వికసిత్ భారత్ వైపుకు కొనసాగుతోందని తెలిపారు.
సెమీ కండెక్టర్ల రంగంపై కేంద్ర ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ.. సెమికండక్టర్ రంగానికి భారీ తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మొదటి వాణిజ్య ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ఏడాది నాలుగు ప్లాంట్లు ఆపరేషన్లు మొదలు పెట్టనున్నాయి. 2025లో మూడు ప్లాంట్లలో పైలట్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా ఈ రంగానికి 40 వేల కోట్లు కేటాయించడంతో మరింత అభివృద్ధి సాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్..
Follow Us On: Pinterest


