కలం, సినిమా : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan).. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని.. గత కొన్ని రోజులు న్యూస్ అయితే వస్తుంది కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు వినిపించింది. ఆ తర్వాత లోకేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి.. ఈ క్రేజీ మల్టీస్టారర్ కి డైరెక్టర్ ఎవరంటే.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పేరు తెర పైకి వచ్చింది. ఇంతకీ.. లక్కీ ఛాన్స్ దక్కించుకున్న డైరెక్టర్ ఎవరు? ఈ భారీ చిత్రం పట్టాలెక్కేది ఎప్పుడు?
రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి దాదాపు 21 చిత్రాల్లో నటించారు. 1975 నుంచి 1979 మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక వీరిద్దరూ ఫస్ట్ అపూర్వ రాగంగల్ అనే చిత్రంతో వెండితెర పై మెరిశారు. చివరిగా అల్లావుద్దీన్ అద్భుత విలాక్కుమ్ అనే చిత్రంతో అలరించారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు రజినీ, కమల్ కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి రజినీ, కమల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులందరూ ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
కమల్ తో విక్రమ్, రజినీతో కూలీ సినిమాలు తీసిన సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ను కథ రెడీ చేయమన్నారు. అయితే.. లోకేష్ గ్యాంగ్ స్టర్ స్టోరీ చెప్పడం.. రజినీ, కమల్ ఇద్దరూ యాక్షన్ మూవీ కాకుండా సింపుల్ స్టోరీ ఉంటే చెప్పమంటే.. సింపుల్ స్టోరీ రాయడం తన వల్ల కాదని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. మరి.. ఎవరు ఈ క్రేజీ మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేస్తారంటే.. జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ (Nelson Dilipkumar) కుమార్ పేరు వినిపిస్తుంది. ఇప్పటికే స్టోరీ రెడీ చేసి.. ఇద్దరు సూపర్ స్టార్స్ కు వినిపించగా ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
రజినీ, కమల్ తో అనౌన్స్ మెంట్ వీడియో కోసం 2 రోజులు షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో.. ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఈ న్యూస్ రజినీ, కమల్ ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇస్తుంది. దీనికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రేజీ మల్టీస్టారర్ ను స్టార్ట్ చేస్తాడని సమాచారం.


