కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్(Medak) జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 403 వార్డులలో 5,30,055 మంది ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మున్సిపాలిటీలో 403 వార్డులకు 3,615 మంది నామినేషన్లు (Nominations) దాఖలు చేశారు. జిల్లాలోని ఏకైక కార్పొరేషన్ సిద్దిపేట(Siddipet)కు ఇంకా కాలపరిమితి ఉండటంతో ఎన్నికలు జరగడం లేదు.
అధికార కాంగ్రెస్(Congress) పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై చేయి సాధించడం కోసం టికెట్ల కేటాయింపు నుండి జాగ్రత్తలు తీసుకున్నాయి. రెబెల్స్ బెడద లేకుండా నాయకులను బుజ్జగించారు. ఎన్నికల సమయానికి టికెట్లు రానివారు పార్టీలు ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ ..ప్రతి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ తమ పరిధిలోని మున్సిపాలిటీలో అన్ని తామై వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్(BRS) పార్టీ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి బాధ్యత తీసుకొని వరుసగా మున్సిపాలిటీల వారీగా సమీక్షలు నిర్వహించారు. చేరికలు, ప్రచారం, అభ్యర్థుల ఎంపిక ఆయన సూచనల మేరకే జరుగుతున్నాయి. బీజేపీ(BJP)కి మెదక్ నుండి ఎంపీగా రఘునందన్ ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. బలమైన క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని చాలా మున్సిపాలిటీలలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ప్రాబల్యం కుడా ఈ ఎన్నికల్లో ఉండబోతుంది. జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్ చెరు నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాలు ఫలితాలను ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెదక్(Medak) జిల్లాలోని నాలుగు మున్సిపాలిటిల్లో మొత్తం 87,185 ఓటర్లు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ
వార్డులు – 32 వార్డులు
దాఖలైన నామినేషన్లు – 271
ఓటర్ల సంఖ్య – 36,955
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ మహిళ
నర్సాపూర్ మున్సిపాలిటీ
వార్డులు – 15
దాఖలైన నామినేషన్లు – 118
ఓటర్ల సంఖ్య – 16,876
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్ మహిళ
తూఫ్రాన్ మున్సిపాలిటీ
వార్డులు – 16
దాఖలైన నామినేషన్లు – 141
ఓటర్ల సంఖ్య – 20,259
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్ మహిళ
రామాయంపేట మున్సిపాలిటీ
వార్డులు – 12
దాఖలైన నామినేషన్లు – 118
ఓటర్ల సంఖ్య – 13,095
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్ మహిళ
సిద్ధిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటిల్లో మొత్తం ఓటర్లు 10,1085
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటి
వార్డులు – 20
దాఖలైన నామినేషన్లు – 185
ఓటర్ల సంఖ్య – 46,740
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ మహిళ
దుబ్బాక మున్సిపాలిటీ
వార్డులు – 20
దాఖలైన నామినేషన్లు – 235
ఓటర్ల సంఖ్య – 21,341
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ మహిళ
హుస్నాబాద్ మున్సిపాలిటీ
వార్డులు – 20
దాఖలైన నామినేషన్లు – 149
ఓటర్ల సంఖ్య – 19,227
ఛైర్మన్ రిజర్వేషన్ – ఎస్సీ మహిళ
చేర్యాల మున్సిపాలిటీ
వార్డులు – 12
దాఖలైన నామినేషన్లు – 85
ఓటర్ల సంఖ్య – 13,777
ఛైర్మన్ రిజర్వేషన్ – ఎస్సీ మహిళ
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 3,41,785 మంది ఓటర్లు ఉన్నారు.
అందోల్-జోగిపేట
వార్డులు – 20
దాఖలైన నామినేషన్లు – 156
ఓటర్ల సంఖ్య – 16, 450
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్
గడ్డపోతారం
వార్డులు – 18
దాఖలైన నామినేషన్లు – 168
ఓటర్ల సంఖ్య – 11,983
ఛైర్మన్ రిజర్వేషన్ – ఎస్సీ మహిళ
గుమ్మడిదల
వార్డులు – 22
దాఖలైన నామినేషన్లు – 169
ఓటర్ల సంఖ్య – 23,926
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ జనరల్
ఇంద్రేశం
వార్డులు – 18 వార్డులు
దాఖలైన నామినేషన్లు – 166
ఓటర్ల సంఖ్య – 13,140
ఛైర్మన్ రిజర్వేషన్ – ఎస్సీ మహిళ
ఇస్నాపూర్
వార్డులు – 18
దాఖలైన నామినేషన్లు – 245
ఓటర్ల సంఖ్య – 35,835
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్ మహిళ
జిన్నారం
వార్డులు – 20
దాఖలైన నామినేషన్లు – 165
ఓటర్ల సంఖ్య – 12,475
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ జనరల్
కోహిర్
వార్డులు – 16
దాఖలైన నామినేషన్లు – 126
ఓటర్ల సంఖ్య – 10,832
ఛైర్మన్ రిజర్వేషన్ – ఎస్సీ జనరల్
నారయణఖేడ్
వార్డులు – 15
దాఖలైన నామినేషన్లు – 153
ఓటర్ల సంఖ్య – 17,675
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ జనరల్
సదాశివపేట
వార్డులు – 26 వార్డులు
దాఖలైన నామినేషన్లు – 225
ఓటర్ల సంఖ్య – 36,982
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్ మహిళ
సంగారెడ్డి
వార్డులు – 38
దాఖలైన నామినేషన్లు – 394
ఓటర్ల సంఖ్య – 83,668
ఛైర్మన్ రిజర్వేషన్ – జనరల్ మహిళ
జహీరాబాద్
వార్డులు – 37
దాఖలైన నామినేషన్లు – 326
ఓటర్ల సంఖ్య – 78,819
ఛైర్మన్ రిజర్వేషన్ – బీసీ జనరల్


