నిజామాబాద్ పోక్సో కోర్టు సంచలన తీర్పు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బాల్కొండ (Balkonda) పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి అదృశ్యం హత్య పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 12న చిట్టాపూర్ గ్రామానికి చెందిన మహిళ తన 12 ఏళ్ల చిన్న కొడుకు కనిపించడం లేదని బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బండి నరేందర్ అనే వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి, గణేష్ విగ్రహాలు చూపిస్తానని చెప్పి ఆమె చిన్న కొడుకును తన బైక్ పై తీసుకెళ్లాడు.

కొంత సమయం తర్వాత బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నరేందర్‌ను ఫోన్‌లో సంప్రదించగా చిట్టాపూర్ గ్రామంలోని కుమ్మరి సంఘం గణేష్ విగ్రహం వద్ద బాలుడిని వదిలివచ్చానని తెలిపాడు. అయితే, అక్కడ పరిసర ప్రాంతాల్లో వెతికినా బాలుడు కనిపించలేదు. ఈ ఘటనపై బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 108/2024గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు బండి నరేంద్ర అలియాస్ నరేందర్, గొర్రెల కాపరి, బాల్కొండ గ్రామస్తుడు నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాల ద్వారా నిరూపించబడింది.

ఈ కేసులో సెషన్స్ కేసు నంబర్ 86/2024లో నిజామాబాద్‌లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ బహిరంగ న్యాయస్థానంలో తీర్పు వెల్లడించారు. నిందితుడు బండి నరేంద్రపై నేరం రుజువు కావడంతో BNS సెక్షన్ 103(1) ప్రకారం జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష కూడా వేశారు. BNS సెక్షన్ 238 ప్రకారం: ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>