సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో.. స్కూల్‌లో 200 గ్లాసుల పంపిణీ

కలం, జగిత్యాల: స్వామి కృపతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ (Sathya Sai Annapurna Trust) ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల సందర్శన దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ బృందం జగిత్యాల (Jagtial) టీఆర్ నగర్ లోని ప్రభుత్వ ఎంపీపీఎస్, జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు ఉదయం పూట అందించే పోషకాహార పానీయం రాగి జావ తాగడానికి అవసరం ఉండటంతో 200 స్టీల్ గ్లాసులను పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ గ్లాసులను అందించిన దాత సీతారామరాజుకి ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో OWOF ట్రస్ట్ యొక్క మూడు ప్రధాన విభాగాలైన పోషణ, విద్య & ఆరోగ్యం గురించి విద్యార్థులకు, సిబ్బందికి వివరించారు. అలాగే సద్గురు మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. రాజారాం, టీఆర్ నగర్ రోడ్‌లో ఉన్న ఉచిత ఆసుపత్రి సేవలను గ్రామ ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతీయ అధిపతి వూటూరి శ్రీకాంత్, రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, ప్రజలు జె. రవీందర్  పాల్గొన్నారు.

Also Read : 4 డిమాండ్లపై ఏం చేద్దాం?.. ఉద్యోగుల జేఏసీ చర్చ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>