epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

ముగిసిన నామినేషన్లు.. ఖమ్మంలో పొడవని పొత్తులు

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ మినహా, ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ కు, అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలకు అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి ఇప్పటి వరకూ 326 నామినేషన్లు దాఖలు చేశారు. నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా.. మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కు రిజర్వు అయింది. కాగా ఇక్కడ అధికారంలో ఉన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీఠం పై ఎర్ర జెండా ఎగురవేయాలని చాలా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ చూస్తే కొత్తగూడెంలో కాంగ్రెస్ 48 స్థానాలకు.. బీఆర్ఎస్ 40 స్థానాలకు నామినేషన్ దాఖలు చేసింది.

మరో పక్క అశ్వారావుపేటలోని 22 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 18 స్థానాలకు నామినేషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ 22 స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసింది. చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. అలాగే ఇల్లందు 24 మున్సిపాలిటీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 28, బీ ఆర్ ఎస్ నుంచి 34 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఛైర్ పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇల్లందు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి రెబల్స్ ఎక్కువ మంది పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్​, సీపీఐ కలుస్తాయా?

కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పొత్తుల అంశం తర్వాత ముందైతే నామినేషన్ వేయండని పార్టీల నుంచి సంకేతం రావడంతో ఆశా వాహులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మరో పక్క కాంగ్రెస్ సీపీఐ ల మధ్య పొత్తు కుదరకపోతే సీపీఐ తో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ కాంగ్రెస్, సీపీఐ పొత్తు సక్సెస్ అయితే అసంతృప్తులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.

ఖమ్మం (Khammam) జిల్లాలో వైరా లాంటి కొన్ని చోట్ల బీఆర్ఎస్ సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ జనరల్ మహిళకు రిజర్వు అయిన సంగతి తెలిసిందే. ఎదులపురంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ 32 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ 25మందిని ప్రకటించగా, ఏడు స్థానాలు సీపీఐ కి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి అనుచరులకు టికెట్లు లభించడంతో వారే ఛైర్పర్సన్ రేసులో ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాల పై ప్రధాన పార్టీల నేతలందరూ కన్ను వేయడం, పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతానికి ఆ పదవుల విషయాన్ని పక్కన పెట్టాయి. ముందైతే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలవండి తర్వాత పదవుల సంగతి చూద్దాం అంటూ నేతలు ఆశావహులకు చెప్పడంతో ప్రస్తుతానికి స్థానిక నేతలు అందరూ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని, గెలవడంపై దృష్టి సారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>