epaper
Friday, January 30, 2026
spot_img
epaper

మేడారంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్​

కలం, వరంగల్ బ్యూరో​ : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ (British Deputy High Commissioner) గ్యారత్ వెన్ ఓవెన్ (Gareth Wynn Owen) మేడారం (Medaram) లోని సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్యారత్ వెన్ ఓవెన్ సంప్రదాయ వస్త్రధారణలో రావడం అక్కడికి వచ్చిన భక్తులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. మేడారం మహా జాతర ప్రాధాన్యతను, నూతనంగా నిర్మించిన గద్దెల విశిష్టతను వారు వివరించారు. అలాగే ఈ ప్రాంత ఆదివాసీ చరిత్రను, జాతర (Medaram) కోసం ప్రభుత్వం భక్తులకు కల్పించిన విస్తృత ఏర్పాట్ల గురించి ఆయనకు తెలియజేశారు. గ్యారత్ వెన్ ఓవెన్ (Gareth Wynn Owen) జాతర విశేషాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

Read Also: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>