కలం, వెబ్డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వద్ద నిజాం నగలు (Nizam Jewels) సురక్షితంగా ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అత్యంత విలువైన 173 నిజాం నగలు 1995 నుంచి ఆర్బీఐ వాల్ట్స్లో భద్రంగా ఉన్నాయని చెప్పారు.
‘నిజాం నగలు చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యం ఉన్నవి. ఈ కళాఖండాల పరిరక్షణను సాంస్కృతిక శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం వీటి భద్రత, పరిరక్షణ, బీమా కోసం ఆర్బీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, వీటిని అత్యంత భద్రత కలిగిన ఆర్బీఐ వాల్ట్స్లో ఉంచాం’ అని ఆయన వెల్లడించారు. అయితే, వీటిని తిరిగి హైదరాబాద్కు పంపే విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర మంత్రి (Gajendra Singh Shekhawat ) స్పష్టం చేశారు.
కాగా, నిజాం నగలను (Nizam Jewels) హైదరాబాద్కు తిరిగి తీసుకురావాలని ఆయన వారసులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రికి సైతం వాళ్లు అనేకసార్లు విజ్ఙప్తి చేశారు. మరోవైపు నిజాం కాలం నాటి అనేక ఇతర ఆభరణాలు, అపురూప వస్తువులు హైదరాబాద్లోని పురాతన సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నాయి.
Read Also: బీహార్ ప్రభుత్వం కీలకం నిర్ణయం.. ఉద్యోగుల సోషల్ మీడియాపై ఆంక్షలు
Follow Us On: Instagram


