కలం, వరంగల్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. గురువారం వర్ధన్నపేట (Wardhannapet) మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కేసీఆర్కు సిట్ నోటీస్ ఇవ్వడం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. పరిపాలన విధివిధానాలు తెలియనివాళ్ళు పాలకులుగా ఉండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.
కేవలం రాజకీయ కక్షతోనే సిట్ పేరిట బీఆర్ఎస్ (BRS) నాయకులను కాంగ్రెస్ సర్కార్ వేధిస్తుందని ఆరోపించారు. రేవంత్ దుర్మార్గపు పాలనకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అమలుచేయలేకనే డ్రామాలకి తెరలేపిందని ఎర్రబెల్లి మండిపడ్డారు.
Read Also: మేడిగడ్డ బ్యారేజ్ డేంజరస్.. సీరియస్ కేటగిరీలో చేర్చిన కేంద్రం
Follow Us On : WhatsApp


