కలం, ఖమ్మం బ్యూరో : పోలీసు పహారాలో కూల్చివేతలు కథనానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు, ఖమ్మం (Khammam) నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రం.బాలగంగదర్ తిలక్ తెలిపారు. ఖమ్మం ప్రకాష్ నగర్ నుంచి ధనుసలాపురం వరకూ చేపడుతున్న రోడ్ల విస్తరణలో నిర్వాసితులకు గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసి గృహ ప్రవేశం కూడా చేయించడం జరిగిందని అన్నారు.
బుధవారం నిర్వాసితులైన నిరుపేదల విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి వెంటనే రాత్రికి రాత్రే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఖమ్మం (Khammam) అర్బన్ తహసీల్దార్ చేతుల మీదుగా అల్లిపురంలో ఇళ్లు కేటాయించి గృహ ప్రవేశం చేయించడంతో లబ్ది దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆ కులాలకు బీసీ హోదా వర్తించదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp


