epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు హాజరవడంపై కేసీఆర్ క్లారిటీ

కలం, తెలంగాణ బ్యూరో : సిట్ పోలీసుల (KCR SIT Inquiry) ముందు విచారణకు హాజరు కాలేనని, మరో తేదీని పిక్స్ చేయాలని కేసీఆర్ జవాబు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో ఆ ప్రక్రియలో మునిగి ఉన్నందున నోటీసుల్లో పేర్కొన్నట్లుగా జనవరి 30న విచారణకు హాజరు కాలేనని ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ రాతపూర్వకంగా తెలియజేశారు. ప్రస్తుతం తాను ఎర్రవల్లిలో ఉంటున్నందున సీఆర్పీసీలోని నిబంధనల ప్రకారం తనను నివాసంలోనే విచారించాలని స్పష్టం చేశారు. నందినగర్ నివాసంలో తాను ఉండడం లేదని పేర్కొన్నారు.

దీనికి తోడు సీఆర్పీసీలో ఫలానా స్థలంలో లేదా ఫలానా నగరం పరిధిలో విచారించాలనే నిబంధనేమీ లేదని గుర్తుచేశారు. ఈ కారణంగా హైదరాబాద్ పరిధిలోనే విచారణ అనేది వర్తించదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రీ షెడ్యూలు ప్రోగ్రామ్స్ ఉన్నందున పోలీసులు పేర్కొన్నట్లుగా జనవరి 30న హాజరు కావడం కుదరదన్నారు. పోలీసులు వారికి సౌకర్యంగా ఉండే ఏదైనా తేదీని ఫిక్స్ చేయవచ్చునని, ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో (Erravalli Farmhouse) విచారణకు తాను హాజరు కాగలనని పేర్కొన్నారు.

Read Also: వనం వీడిన సమ్మక్క జనం లోకి..

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>